News May 11, 2024

NZB జిల్లాలో 3 రోజులు మద్యం షాపులు బంద్

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 13 వరకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు.

Similar News

News March 2, 2026

NZB: అదనపు కలెక్టర్‌గా దిలీప్ కుమార్ బాధ్యతలు

image

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన అంకిత్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లడంతో ప్రభుత్వం దిలీప్ కుమార్‌ను ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించింది. బాధ్యతల స్వీకారం అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News March 2, 2026

NZB: హోలీ వేళ పోలీసుల ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

image

హోలీ పండుగ సందర్భంగా నిజామాకబాద్ జిల్లా ప్రజలు పోలీసు నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై లేదా వాహనాలపై బలవంతంగా రంగులు, నీటిని చల్లడం నిషేధమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే నిజామాబాద్ పోలీస్ చట్టం సెక్షన్ 76 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆంక్షలు ఈనెల 2వ తేదీ సాయంత్రం 6 నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు.

News March 2, 2026

NZB: ఇంటర్ పరీక్షలకు.. 687 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో భాగంగా సోమవారం మ్యాథ్స్-1 ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. NZB జిల్లా వ్యాప్తంగా 21,473 మంది విద్యార్థులకు 687 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు అధికారులు తెలిపారు. 18,695 మంది జనరల్ విద్యార్థుల్లో 525 మంది, 2,778 ఒకేషనల్ విద్యార్థులకు 162 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారని అధికారులు వివరించారు.