News July 21, 2024

NZB: టాస్క్‌ఫోర్స్ దాడి.. పదిమంది పేకాట రాయుళ్లు అరెస్ట్

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్‌లో ఉన్న లలితానగర్ ఫేజ్ -2లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం పేకాట స్థావరంపై దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి, సీఐ పురుషోత్తం, వారి బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పది మంది పేకాట రాయుళ్లను పట్టుకుని 10 సెల్ ఫోన్లు, రూ.5,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News February 16, 2026

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి సోమవారం తెలిపారు. ఈనెల 12వ తేదీన గాంధీచౌక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని ఒంటిపై బ్లూ కలర్ షర్టు, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు.

News February 16, 2026

NZB: ప్రారంభమైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారాలు

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయంలో గెలిచిన అభ్యర్థులతో స్పెషల్ ఆఫీసర్ ప్రమాణస్వీకారం చేయించారు. మొదటగా కాంగ్రెస్ తరఫున గెలిచిన ఒకటో డివిజన్ అభ్యర్థి అగ్గు బోజన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్ఫాబెటికల్ ప్రకారం ఒక్కొక్కరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు.

News February 16, 2026

NZB: మేయర్ అభ్యర్థిగా ఉమారాణి ఖరారు?

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్‌గా 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి పేరు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముదిరాజ్ సామజిక వర్గానికి చెందిన ఆమె భర్త కరాటే రమేశ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు నమ్మిన బంటుగా కొన్నేళ్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఉమారాణి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని సమాచారం. అయితే రమేశ్ గతంలో టీడీపీలో ఉండి కాంగ్రెస్‌లోకి రావడంతో కొందరు వ్యతిరేకిస్తున్నారు.