News September 20, 2024

NZB: డాక్టర్ పేరిట GGHలో రూ.90 వేల నూతన ఫోన్ అపహరణ

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో డాక్టర్ పేరిట రూ.90 వేలు విలువ చేసే కొత్త ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు. నగరంలోని ఒక సెల్ ఫోన్ షాపుకు డాక్టర్ పేరిట ఫోన్ చేసి GGHకు ఫోన్ తెస్తే తీసుకుంటానని నమ్మబలికి రప్పించి సూపరింటెండెంట్ రూం ఎదురుగా కూర్చోబెట్టాడు. లోపల సార్‌కు ఫోన్ చూయించి వస్తానని ఫోన్‌తో సహా పరారయ్యాడు. దీనిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 20, 2024

KMR: ఇలాంటి పురాతన బావులు మీ ఊరిలో ఉన్నాయా.. కామెంట్..!

image

లింగంపేటలోని నాగన్న మెట్ల బావిని నేడు కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. కాగా ఈ బావికి చాలా ప్రత్యేకతలున్నాయి. పాపన్నపేట సంస్థాన కాలంలో జాక్సాని నాగన్న అనే వ్యక్తి 18 వ శతాబ్దంలో నిర్మించాడని స్థానిక కైఫియత్తులో లిఖించబడింది. ఈ నిర్మాణాన్ని ఉపరితలం నుంచి 100 అడుగుల లోతు వరకు ఐదు అంతస్తులుగా రాతితో అందంగా నిర్మించారు. మరీ ఇలాంటి పురాతన బావులు మీ గ్రామంలో ఉన్నాయా.. ఉంటే కామెంట్ చేయండి

News September 20, 2024

NZB: ప్రేమకు నిరాకరించిన యువతి.. యువకుడు ఆత్మహత్య

image

యువతీ ప్రేమకు నిరాకరించిందని యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనా ఖానాపూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే గౌతమ్ కాంబ్లె (26) ఓ యువతిని ప్రేమించాడు. ఇందుకు యువతి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఖానాపూర్ శివారులో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. స్థానికులు నిజామాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 20, 2024

TU: ఎంఎడ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఎంఎడ్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈనెల 28 నుంచి అక్టోబర్ 3 వరకు పరీక్షలు కొనసాగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌ను సంప్రందించాలని సూచించారు.