News November 4, 2025

NZB: డాక్టర్, రియల్టర్ వేధిస్తున్నారని మహిళ ఫిర్యాదు

image

NZB నగరానికి చెందిన ఓ ప్రముఖ డెంటల్ వైద్యుడు, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఓ మహిళ ఆరోపించింది. తనకు వీడియో కాల్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు సోమవారం CP సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేట్ సంస్థలో పని చేసేదాన్నని, వారి వేధింపులు తాళలేక రెండేళ్ల క్రితం జాబ్ మానేసినట్లు చెప్పింది. తరుచూ ఫోన్లు చేసి వేధిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News November 4, 2025

జూబ్లీ బైపోల్: EVMలు రెడీ.. 11 వరకు వెయిటింగ్

image

ఈ నెల 11వ తేదీ జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి అధికారులు కీలక ఘట్టం పూర్తిచేశారు. 58 మంది అభ్యర్థుల పేర్లు, గుర్తుతోపాటు నోటాను ఈవీఎంలలో సిద్ధం చేశారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరుగకుండా అధికారులు ఒకటికి రెండుసార్లు చెక్ చేసి ఈ తంతు ముగించారు. ఎలక్షన్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో ఈ నిక్షిప్త కార్యక్రమం నిర్వహించారు.

News November 4, 2025

జూబ్లీలో నేడే పోలింగ్.. అదీ ఇంటి వద్దే

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ ప్రక్రియ ఈరోజు నిర్వహిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో కాదులెండీ.. ఇంటి వద్దే. తాము పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేమని దివ్యాంగులు, వృద్ధులు ఈసీ వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో 103 మంది ఓటర్ల ఇంటి వద్దకే అధికారులు వెళ్లి ఓటు వేయిస్తారు. సంచార ఓటరు కేంద్రం ఇందుకు సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈ రోజు ఈ ప్రక్రియ ముగియకపోతే గురువారమూ కొనసాగిస్తారు.

News November 4, 2025

న్యూస్ అప్‌డేట్స్

image

* TG: 1,037 ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ G.O. జారీ. 2026 మార్చి 31 వరకు వారు విధుల్లో కొనసాగనున్నారు.
* తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్‌ను కోరిన సీఎం రేవంత్
* సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను సహించం: ఏపీ హోంమంత్రి అనిత
* మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని TG సర్కార్ ఆదేశం