News March 10, 2026
NZB: తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యం

కోటగిరి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(27) తన ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. స్థానికంగా, బంధువుల వద్ద వెతికినా వారి ఆచూకీ లభించలేదని భర్త గంగాధర్ పేర్కొన్నారు. అలాగే కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సాయిలు(27) హోటల్‌కు వెళ్తానని చెప్పి కనిపించకుండా పోయారు. ఇరువురి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై సునీల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 20, 2026
నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News April 20, 2026
బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.