News March 19, 2024
NZB: తాడు కట్టుకుని కాల్వలో దూకి దంపతుల ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బోధన్ మండలం అమ్ధాపూర్‌కి చెందిన బాబయ్య(65), పోచమ్మ (60) పేదరికంలో మగ్గుతున్నారు. ఉర్లో అప్పులు కావడం, తీర్చే మార్గం లేగ నిజామాబాద్‌లో 4 నెలలుగా బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన వారు నడుముకు తాడు కట్టుకుని నుస్రత్‌నగర్‌లోని నిజాంసాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 11, 2025
NZB: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి కిడ్నాపైన బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. మద్నూర్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ బాలాజీ రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్ గ్రామంలో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ఏసీపీ వివరించారు. సమావేశంలో SHO రఘుపతి పాల్గొన్నారు.
News April 11, 2025
పోతంగల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

పోతంగల్ మండలం హంగర్గ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరోకరికి తీవ్ర గాయలయ్యాయి. పోతంగల్‌కి చెందిన ఇద్దరు యువకులు బైక్ పై హంగర్గ వెళుతుండగా కుక్క అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్నట్టు స్థానికులు తెలిపారు. ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన మరొకరిని ఆసుపత్రికి తరలించారు.
News April 11, 2025
NZB: ‘సామాజిక సేవా నిర్వహించడం గొప్ప విషయం’

నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతా కుంచాల విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం నిర్వహించిన పలు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంతగానో పని ఒత్తిడితో కూడుకుని ఉండే విధుల్లో కొనసాగుతున్నప్పటికీ జిల్లా జడ్జి సేవా కార్యక్రమాలు జరపడం విశేషమన్నారు.