News July 17, 2024

NZB: దంపతుల ఆత్మహత్య.. నిందితురాలి అరెస్టు

image

పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన యువ దంపతులు అనిల్ కుమార్, శైలజ ఆత్మహత్యకు కారకురాలైన మృతురాలి పిన్ని కంకోళ్ల లక్ష్మిని బుధవారం అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. యువ దంపతులు సోమవారం రాత్రి నవీపేట్ శివారులో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడిస్తూ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News February 27, 2026

ముప్కాల్: మద్యం మత్తులో 100కు ఫోన్.. 10 రోజుల జైలు

image

మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన రేంజర్ల గ్రామానికి చెందిన సరుగుల ప్రేమ్ కుమార్‌కు ఆర్మూర్ కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. నిందితుడిని ముప్కాల్ పోలీసులు ఆర్మూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అత్యవసర సేవలకు ఆటంకం కలిగించినందుకు ఈ తీర్పునిచ్చినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. తప్పుడు సమాచారం లేదా అసభ్య ప్రవర్తనతో పోలీసుల సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 27, 2026

NZB: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

image

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక బుకింగ్ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లో “మనా ఇసుక వాహనం” యాప్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.