News March 30, 2025
NZB: దరఖాస్తుకు రేపే చివరి తేదీ

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం.. ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 20న పరీక్ష జరుగుతుందని, అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రిజర్వేషన్, నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News May 7, 2025
NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి

NZB ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రి రేకుల షెడ్డు కింద అపస్మారక స్థితిలో పడి ఉండడంతో సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 40-45 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మృతుడి జేబులో తినాలి రవి, ఆర్మూరు మండలం మామిడిపల్లి అనే ఆధార్ కార్డు ఉందన్నారు.
News May 7, 2025
నిజామాబాద్: బావిలో పడి వ్యక్తి మృతి

జక్రాన్‌పల్లిలో బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. గ్రామానికి చెందిన మాడవీరి ముత్యం(50) తాగిన మైకంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బావిలో మృతదేహం తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ తిరుపతి మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News May 7, 2025
NZB: జిల్లా వాసికి జాతీయ అవార్డు

నిజామాబాద్ జిల్లా వాసికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ రెడ్ క్రాస్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. వచ్చే నెల 13న రాష్ట్రపతి భవన్‌లో జరిగే సమావేశంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌ను జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు అభినందించారు.