News February 21, 2025
NZB: దారి దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు అరెస్ట్

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట నిజాంసాగర్ కెనాల్ వద్ద దారిదోపిడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే బిహార్‌కు చెందిన ముగ్గురు స్థానికంగా ఉండే రైస్ మిల్లులో పనిచేస్తూ, ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News February 22, 2025
KMR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం బిక్కనూర్‌లో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా గంగాపురానికి చెందిన శ్రీనివాస్ ఓ శుభకార్యం నిమిత్తం తన అత్తగారింటికి వచ్చాడు. శుక్రవారం అతిగా మద్యం సేవించి ఆరుబయట పడుకోవడంతో తెల్లవారుజామున భార్య సరిత వచ్చి నిద్రలేపిన లేవలేదు. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 22, 2025
NZB జిల్లాలో వరుస గుండెపోట్లు

ఉమ్మడి NZBలో వరుస గుండెపోట్లు కలకలం రేపుతున్నాయి. 2రోజుల్లో బడికెళ్లే బాలిక, కూతురి పెళ్లిలో తండ్రి ఇలా ఇద్దరు మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు రావడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎలాంటి అనారోగ్య కారణాలు లేనివారు గుండెపోటుకు గురయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు. మంచి ఆరోగ్య అలవాట్లు మెయిన్‌టేన్ చేస్తే అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని వైద్యులు సూచిస్తున్నారు.
News February 22, 2025
NZB: LRS పేరిట వసూళ్లకు తెర లేపిన కాంగ్రెస్: మాజీ మంత్రి

LRS పేరు మీద వసూళ్లకు కాంగ్రెస్ తెర లేపిందని, రూ.20 వేల కోట్ల వసూళ్లకు ప్లాన్ వేశారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన BRS జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు KCR దోచుకోవడానికి, దాచుకోవడానికి LRS తీసుకు వచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పారని పేర్కొన్నారు.