News July 9, 2025
NZB: దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం.. ASI భార్య మృతి

NZB కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో NZB పోలీస్ ఇంటలిజెన్స్‌లో పనిచేస్తున్న ASI భీమారావు భార్య భవాని మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. భవాని తన కుమారుడితో కలిసి బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా వారి బైక్‌కు కుక్క అడ్డు వచ్చింది. దాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. దీంతో బైక్ వెనకాల కూర్చున్న భవాని మృతి చెందారు.
Similar News
News July 9, 2025
NZB: రైతుల్లో చిగురించిన ఆశలు..!

NZB జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొంతమంది రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతేడాది 4,36,101.21 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 4,37,135 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేటి వరకు 2,37,372 ఎకరాల్లో (58%) నాట్లు వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
News July 9, 2025
SRSPలో తగ్గిన వరద నీటి ప్రవాహం

మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు కురవక పోవటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్ ఫ్లో రావడం లేదు. గడిచిన 24 గంటల్లో కేవలం 4291 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80TMCలు) కాగా, ప్రస్తుతం 1067 అడుగులు (19.537 TMCలు) మాత్రమే నీటి నిల్వ ఉంది. బాబ్లీ గేట్లు ఎత్తినా ఇప్పటి వరకు కేవలం 8.857 TMCల నీరు మాత్రమే వచ్చి చేరింది.
News July 9, 2025
NZB: GOOD NEWS.. వారికి 3 నెలల జీతాలు జమ

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 2,730 మల్టీపర్పస్ వర్కర్లకు 2025 ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 మాసాల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత GPల TGbPASS ఖాతాలలో జమ చేసిందని DPO శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. అందరూ ప్రత్యేకాధికారులు, పంచాయతి కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధవహించి వెంటనే సంబంధిత మల్టీపర్పస్ వర్కర్ల వ్యక్తిగత ఖాతాలకు వేతనాలు జమ చేయాలని ఆయన సూచించారు.