News December 20, 2025

NZB: నకిలీ నోట్లతో బ్యాంకర్ల అలెర్ట్

image

వర్ని బ్యాంకులో ఏకంగా రూ.2లక్షలకుపైగా నకిలీ నోట్లు బయట పడడంతో జిల్లా మొత్తం బ్యాంకర్లు అలెర్ట్ అయ్యారు. GP ఎన్నికల్లో నకిలీ నోట్లు పంపిణీ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపాజిట్ చేసేందుకు డబ్బు ఎవరు తెచ్చినా బ్యాంకు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిన్నటి వరకూ ఒకటి రెండు దొంగ నోట్లు అనే పరిస్థితి నుంచి అన్ని నోట్లు పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Similar News

News December 25, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*20లక్షల ఉద్యోగాల కల్పనకే మొదటి ప్రాధాన్యం: CM CBN
*రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ శిక్షణలో దేశంలోనే AP టాప్
*వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2/3 మెజార్టీతో గెలుస్తుంది: CM రేవంత్
*2028లోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు: KTR
*ఆరావళి పర్వతాల మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం
*ISRO సరికొత్త చరిత్ర.. కక్ష్యలోకి 6,100కిలోల బరువైన బ్లూబర్డ్ శాటిలైట్‌

News December 25, 2025

సిరిసిల్ల: ధాన్యం కొనుగోలు కమీషన్ చెక్కుల పంపిణీ

image

జిల్లాలో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2023-24 సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 30 శాతం కమీషన్ రూ.1,90,73,487, అలాగే రబీ సీజన్లో 2023- 24లో 2,62,446 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 100 శాతం కమీషన్ రూ.7,86,91,920 విలువైన చెక్కులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పంపిణీ చేశారు.

News December 25, 2025

PHOTO GALLERY: క్రిస్మస్ సందడి

image

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ తదితర నగరాల్లో చర్చిలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇటు క్రైస్తవులు తమ ఇళ్లను కలర్‌ఫుల్ లైట్లతో డెకరేట్ చేశారు. క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోళ్లతో మార్కెట్లూ సందడిగా మారాయి.