News May 11, 2024
NZB: నడిరోడ్డుపై కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. పార్టీ సీనియర్ నేత మునిపల్లి సాయిరెడ్డికి ఇందల్వాయి మండల ప్రచార బాధ్యతలు అప్పగించగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచనల మేరకు ఆయన శనివారం మండలంలోని తిర్మన్పల్లి గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో గౌరారం గ్రామానికి చెందిన సంతోష్‌తో గొడవ జరిగింది. మా ఇలాకాలో మీ పెత్తనం ఏంటని? సాయిరెడ్డిపై సంతోష్ నడిరోడ్డుపై గొడవకు దిగారు.
Similar News
News January 21, 2025
NZB: నేటి నుండి 24 వరకు ప్రజా పాలన వార్డు సభలు
నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఈ నెల 21 నుంచి 24 వరకు వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగరంలోని 60 డివిజన్లలో 7 బృందాలు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు దశల వారీగా ఈ సభలు నిర్వహిస్తారని కమిషనర్ చెప్పారు. ఇందులో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 20, 2025
రుద్రూర్: పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించాలి: కలెక్టర్
పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. సోమవారం ఆయన రుద్రూర్‌లో సందర్శించారు. రుద్రూర్ బస్టాండ్ వెనుక వైపు ఉన్న భూములకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News January 20, 2025
NZB: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో దూకి శివరాం(62) మృతి చెందినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. NZB జిల్లా ఎడపల్లి(M) జానకంపేటకు చెందిన శివరాం పెద్దకొడుకు 2 ఏళ్ల కింద మరణించారు. మనస్తాపంతో శివరాం ఇంటి వద్ద రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు కాపాడారు. సోమవారం బాసర గోదావరిలో దూకారు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. శివరాం చిన్నకొడుకు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.