News October 5, 2025
NZB: నవరాత్రుల్లో మహిళలను వేధించినందుకు19 కేసులు: CP

దుర్గా నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాలలో ఆకతాయిలు అల్లరి చేస్తూ మహిళలను వేధించిన సందర్భాలలో 19 కేసులు నమోదు చేసినట్లు NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. షీ టీం బృందం ప్రత్యేకంగా రాత్రి సమయాలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ మహిళలను వేధిస్తున్న వారిపై దృష్టి సారించిందన్నారు. అలాగే సెప్టెంబర్ నెలలో షీ టీం బృందాల ద్వారా 11 ఈ పెట్టీ కేసుల నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 5, 2025
NZB: ప్రజావాణి రద్దు: కలెక్టర్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రజావాణి రద్దు చేశామన్నారు.
News October 5, 2025
NZB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించాలి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ సంకల్పం మేరకు మున్సిపాలిటీల పరిధిలో కూడా ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించాలన్నారు.
News October 4, 2025
NZB: ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో కలెక్టర్ వారికి దిశా నిర్దేశం చేస్తూ మాట్లాడారు.