News December 31, 2024
NZB: నా జోలికి ఎవరూ రారు: కేఏ పాల్

తన జోలికి వచ్చిన మహామహులు మట్టికరుచుకుపోయారని, అందుకే తన జోలికి వచ్చేందుకు ఎవరూ సాహసం చేయరని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సోమవారం నిజామాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీ నినాదాన్ని ఎంచుకున్నాయన్నారు. తాము గెలిస్తే ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ఉచిత వైద్యం, విద్య అందిస్తామన్నారు.
Similar News
News December 18, 2025
నిజామాబాద్: మూడో స్థానంలో స్వతంత్రులు

నిజామాబాద్ జిల్లాలో జరిగిన లోకల్ దంగల్‌లో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. జిల్లాలో మూడు విడతల్లో 545 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవాలతో కలుపుకొని 362 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొంది మొదటి స్థానంలో నిలవగా, 76 పంచాయతీల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. 60 మంది స్వతంత్రులు గెలిచి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 47 గ్రామాల్లో బీజేపీ చివరగా ఉంది.
News December 18, 2025
NZB: మూడు దశల్లో మహిళలే ఎక్కువ

నిజామాబాద్ జిల్లాలో మూడు దశలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటు వేశారు. జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లో 7,88,356 మంది ఓటర్లు ఉండగా 6,15,257 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 3,49,574 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 2,65,679 మంది, ఇతరులు నలుగురు ఓటేశారు.
News December 18, 2025
నందిపేట్ టాప్.. ఆర్మూర్ లాస్ట్

NZB జిల్లాలో తుది దశ ఎన్నికల్లో ఓటింగ్ 76.45% నమోదైంది. నందిపేట్-78.7%తో ముందు వరుసలో ఉండగా ఆర్మూర్-74.77%తో చివర్‌లో ఉంది. ఆలూర్-76.09%, బాల్కొండ-75.05%, భీమ్‌గల్-76.06%, డొంకేశ్వర్-78.06%, కమ్మర్‌పల్లి-75.19%, మెండోరా-76.29%, మోర్తాడ్-76.44%, ముప్కాల్-77.99%, వేల్పూర్-75.841%, ఏర్గట్ల-78.64% పోలింగ్ నమోదయ్యింది. 12 మండలాల్లో 3,06,795 మందికి గాను 2,34,546 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.


