News March 23, 2024

NZB: నిద్రలోనే గుండెపోటుతో భక్తుడు మృతి

image

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామానికి చెందిన రటపు నరహరి (55) అనే వ్యక్తి దైవ దర్శనానికి వచ్చి శుక్రవారం రాత్రి స్థానిక మంగళ ఘాట్ వద్ద నిద్రిస్తుండగా, గుండెపోటుతో నిద్రలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ధర్మపురి ఎస్సై తెలిపారు.

Similar News

News January 6, 2025

లింగంపేట: బెట్టింగ్ యాప్‌తో యువకుడు బలి

image

బెట్టింగ్ యాప్‌లో సొమ్ము పోగొట్టుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగంపేట మండలం ఐలాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగరాజు(29) భార్య, పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆన్‌లైన్ గేమ్స్‌లో మోసపోయి చెరువుల దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News January 5, 2025

నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి: ఎమ్మెల్యే

image

నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని తాను కూడా డిమాండ్ చేస్తున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలనతో ముందుకు సాగుతున్న విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్, బీజీపీకి లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News January 5, 2025

కామారెడ్డి: ద్వితీయ స్థానంలో నిలిచిన అనిల్

image

క్యాసంపల్లి ZPHS పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి అనిల్ తేజ్, ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన ఎనిమిదవ ఇంటర్ డిస్ట్రిక్ట్ మౌంటెన్ సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపి ద్వితీయ స్థానం సాధించారు. ఈ విజయంతో అనిల్ తేజ్ సిల్వర్ మెడల్, ప్రశంసా పత్రం అందుకున్నారు. పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు నరసింహరావు, గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తాడ్వాయి శ్రీనివాస్ అభినందించారు.