News July 29, 2024
NZB: నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ పై వేటు

డయల్ 100 కాల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిజామాబాద్ ఐదో టౌన్ ఎస్ఐ అశోక్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. టౌన్ పరిధిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి 100 కాల్ రాగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సీపీ గుర్తించారు. అనంతరం స్టేషన్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News August 7, 2025
NZB: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతంతో పాటు నదులు, వాగుల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు. అవసరం అయితే తప్ప ఇళ్ల బయటకు ఎవరూ రాకూడదని హితవు పలికారు. చేపల వేట, ఈత సరదా కోసం చెరువులు, కాల్వలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లకూడదని సూచించారు.
News August 7, 2025
NZB: 2,637 మంది లబ్దిదారులకు రూ.30.07 కోట్ల రుణాలు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 2,637 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ.30.07 కోట్ల రుణాలు ఇప్పించామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు ఆర్ధిక స్థోమత లేని లబ్దిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష వరకు రుణం అందిస్తూ, నిర్మాణ పనులు చేపట్టేలా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
News August 7, 2025
NZB: కంట్రోల్ రూంకి ఫోన్ చేయండి: కలెక్టర్

భారీ వర్షాలకు సహాయక చర్యలు అవసరమైన పక్షంలో కలెక్టరేట్‌లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462 – 220183కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని NZB జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ప్రజలకు సూచించారు. భారీ వర్షాల వల్ల ఎక్కడైనా ప్రమాదం ఎదురైనా, లేక అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కంట్రోల్ రూంకు ఫోన్ చేయాలన్నారు. ఇప్పటికే పర్యవేక్షణ చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించామన్నారు.