News January 25, 2026
NZB: నేడు జిల్లాకు మంత్రులు, TPCC చీఫ్ రాక

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదివారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీతో కలిసి NZBలో మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమై దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం ఆర్మూర్ వెళ్లి అక్కడ సమావేశం నిర్వహిస్తారు.
Similar News
News February 9, 2026
టీ20ల్లో చెత్త రికార్డ్

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ శనక చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. ఇవాళ T20 WCలో ఐర్లాండ్‌పై డకౌటైన ఆయన టీ20ల్లో అత్యధిక(16) సార్లు సున్నాకే ఔటైన ప్లేయర్‌గా నిలిచారు. నేడు ఎదుర్కొన్న తొలి బంతినే షార్ట్ థర్డ్ మ్యాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. టీ20Iల్లో ఇతని తర్వాత రువాండ జట్టుకు చెందిన జప్పీ(15), ఐర్లాండ్ కెప్టెన్ స్టెర్లింగ్(14) డకౌట్ అయిన లిస్టులో ఉన్నారు.
News February 8, 2026
వరంగల్ సీపీ కీలక ఆదేశాలు

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగామ, ఘన్ పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల్లో సోమవారం సా.5 గంటలతో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సీపీ సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రచార గడువు ముగిసిన వెంటనే ప్రచారానికి వచ్చిన బయటి వ్యక్తులు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.
News February 8, 2026
పట్టుదలతో సాగిపోవాలి.. GenZ స్టూడెంట్స్‌తో రాహుల్ గాంధీ

జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదని, పట్టుదలతో ముందుకు సాగిపోవాలని జెన్‌జీ విద్యార్థులకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సూచించారు. ‘ఇన్‌సెక్యూరిటీ, కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందని ఎక్కువ మంది చెప్పారు. నువ్వు నిజాయతీగా ఉండటమే ముఖ్యం. అనుకున్న దానికంటే ఎక్కువ సామర్థ్యం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. భారత్ జోడో యాత్రలో ఆ విషయాన్ని తెలుసుకున్నాను’ అని UAEకి చెందిన NRI స్టూడెంట్స్‌తో ఇంటరాక్షన్‌లో చెప్పారు.


