News March 13, 2025

NZB: నేడు సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపికలు

image

నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమణ, గంగారెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు ఆర్మూర్‌లోని మినీ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికైన జిల్లా జట్టును ఈ నెల 16 నుంచి 18 వరకు కరీంనగర్‌లోని హుజూరాబాద్‌లో జరిగే అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్‌కు పంపుతామన్నారు.

Similar News

News April 5, 2026

సిరికొండ: చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి

image

సిరికొండ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం సర్‌పల్లితండాకు చెందిన మాలవత్ రమేశ్ చేపలు పట్టేందుకు వెళ్లి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ ఆదివారం తెలిపారు.

News April 5, 2026

NZB: జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే!

image

గడచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. వేంపల్లె, నిజామాబాద్ సౌత్ 40.1°C, కోటగిరి 40°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా జిల్లాలోని అన్నిప్రాంతాల్లో 35°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి. ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరయ్యారు. నిన్న సాయంత్రం జిల్లాలో పలుచోట్ల వర్షపాతం నమోదయ్యింది. జానకంపేటలో 26.8 మి.మీ, సిరికొండ, సాలూరలో 10 మి.మీ. వర్షం కురిసింది.

News April 5, 2026

NZB: హస్తంలో రగులుతున్న రాజకీయ సెగలు

image

నిజామాబాద్ కాంగ్రెస్‌లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న ధర్మపురి సంజయ్‌కు పదవుల పంపకంలో అన్యాయం జరిగిందని ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ​తగిన గుర్తింపు దక్కడం లేదని ఆగ్రహంతో ఉన్న అభిమానులు, నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ధర్నాకు దిగారు. బలమైన ఓటు బ్యాంకు కలిగిన నేత కావడంతో, ఆయన పార్టీ వీడితే నష్టం తప్పదని కేడర్ ఆందోళన చెందుతోంది.