News February 20, 2025

NZB: పంటల విక్రయాలను పర్యవేక్షించాలి: కలెక్టర్

image

ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభమైనందున క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్ వ్యాపారులు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ రైతుల వద్ద నుంచి పంటను సేకరించేలా చూడాలన్నారు.

Similar News

News February 21, 2025

డిచ్పల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

image

డిచ్పల్లి మండలం బీబీపూర్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. నిజామాబాద్ నగరానికి చెందిన హఫీజ్ సయ్యద్ అయుబ్, మౌలానా మొయినుద్దీన్, హఫీజ్ షాహెద్ రజా, అబ్దుల్ రెహ్మన్ ముషిరాబాద్లో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి వస్తుండగా బీబీపూర్ తండా వద్ద జాతీయ రహదారిపై వీరి కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనగా కారు బోల్తా పడి రెహమాన్ మృతి చెందాడు.

News February 21, 2025

ఆర్మూర్‌: ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ఒకరు మృతి

image

ప్రమాదవశాత్తు డేరాకు నిప్పంటుకుని వృద్ధుడు సజీవ దహనమైన విషాద ఘటన ఆర్మూర్‌లో జరిగింది. మృతుడు సీతారామారావుగా (75) గుర్తించారు. మృతుడు కాలిన గాయాలతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. కొడుకు రామేశ్వర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News February 21, 2025

NZB: దారి దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు అరెస్ట్

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట నిజాంసాగర్ కెనాల్ వద్ద దారిదోపిడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే బిహార్‌కు చెందిన ముగ్గురు స్థానికంగా ఉండే రైస్ మిల్లులో పనిచేస్తూ, ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

error: Content is protected !!