News October 6, 2025

NZB: ‘పక్కాగా ప్రభుత్వ భూముల సర్వే జరపాలి’

image

నిజామాబాద్ జిల్లాలోని మండలాలో ఉన్న అసైన్డ్ భూములు, భూదాన్, ప్రభుత్వ భూముల సర్వేను పక్కాగా జరిపించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, అన్ని మండలాల తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా అసైన్డ్, భూదాన్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సర్వేయర్లతో పక్కాగా సర్వే జరిపించాలన్నారు.

Similar News

News October 6, 2025

ఎడపల్లి: బంగారం కోసం మహిళ హత్య.. ఇద్దరి అరెస్టు

image

దూరపు బంధువైన మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్న కేసులో ఎడపల్లి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచే రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్‌ను ఛేదించి నిందితుడైన జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి బాలకృష్ణ (36)ను, కొండపాక లక్ష్మయ్య (55)లను అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు.

News October 6, 2025

నిజామాబాద్: వీడీసీల ఆగడాలపై చర్యలు తీసుకోండి

image

నిజామాబాద్ జిల్లాలో వీడీసీ ఆగడాలు పెరుగుతున్నాయి. గతంలో ఏర్గట్ల మండలం తాళ్ల రామడుగులో వీడీసీలు గౌడ కులస్థులను వెలివేసినట్లు వారు ఆరోపించారు. దీనిపై అధికారులు, పోలీసులు వారికి సర్దిచెప్పి సమస్యను పరిష్కరించారు. తాజాగా ధర్పల్లి మండలం హోన్నాజీపేటలో వీడీసీల వేధింపులకు బనావత్ బన్నాజీ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

News October 6, 2025

NZB: ZP ఛైర్మన్ దక్కించుకునేందుకు అభ్యర్థుల వేట

image

స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ విడదల కావడంతో NZB జడ్పీ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేట మొదలు పెట్టాయి. గతంలో జనరల్ స్థానం కేటగిరిలో ఉన్న జడ్పీ ఛైర్మన్ ఈసారి బీసీ మహిళకు కేటాయించారు. జిల్లాలో 31 ZPTC స్థానాలు ఉండగా అందులో 6 బీసీ మహిళలకు, 5 జనరల్ మహిళలకు, 7 స్థానాలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఆ స్థానాల నుంచి మహిళా అభ్యర్థుల కోసం పార్టీలు గాలిస్తున్నాయి.