News March 24, 2024
NZB: పట్టపగలే పోలీస్ ఇంట్లో చోరీ

నిజామాబాద్‌లో దొంగలు ఏకంగా ఓ పోలీసు ఇంటికే కన్నం వేశారు. ఎనిమిది తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. కమిషనరేట్‌లోని ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న సాయన్న గూపన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయన ఉదయం విధులకు వెళ్లగా.. కుటుంబీకులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి ఎనిమిది తులాల బంగారు గొలుసు లను అపహరించుకు వెళ్లారు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 28, 2026
NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం: కలెక్టర్

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా పంపిణీ చేపట్టగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలని హితవు పలికారు.
News February 28, 2026
నవీపేట్: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.