News February 14, 2025
NZB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
Similar News
News September 15, 2025
వనపర్తి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

వనపర్తి జిల్లాలో 15 వర్షపాతం నమోదు కేంద్రాల్లో సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా రేవల్లిలో 135.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గణపూర్ 105.0 మి.మీ, గోపాల్‌పేట 104.0 మి.మీ, పెద్దమందడి 100.0 మి.మీ, వనపర్తి, పెబ్బేరు 73.0 మి.మీ, ఏదుల 68.0 మి.మీ, పాన్‌గల్ 64.0 మి.మీ, కొత్తకోట 52.0 మి.మీ, మదనాపూర్ 44.0 మి.మీ, వీపనగండ్ల 40.0 మి.మీ, చిన్నంబావి 33.0 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది.
News September 15, 2025
NLG: దొడ్డు బియ్యంపై మౌనమేల?

NLG జిల్లాలోని రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. జిల్లాలో గోదాములు, MLS పాయింట్లతో పాటు రేషన్ షాపుల్లో 6వేల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏం చేయాలో తెలియక రేషన్ డీలర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు. దొడ్డు బియ్యం నుంచి పురుగులు సన్నబియ్యానికి పడుతున్నాయని లబ్ధిదారులు అంటున్నారు.
News September 15, 2025
కొడికొండ వద్ద మెగా పారిశ్రామిక జోన్

శ్రీ సత్యసాయి జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా మారనుంది. కొడికొండ చెక్‌పోస్టు సరిహద్దులో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు కేటాయించిన భూములు సహా 23 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్, ఐటీ వంటి 16 కేటగిరీల పరిశ్రమల ఏర్పాటు కోసం జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలను లీ అండ్ అసోసియేట్స్ సంస్థకు అప్పగించింది.