News July 3, 2024

NZB: ‘పదెకరాల్లోపు ఉన్నవారికే రైతుభరోసా ఇవ్వండి’

image

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం చేపట్టనున్న రైతుభరోసా పథకంపై రైతుల సూచనలు కోరుతోంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 89 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఇప్పటివరకు 60 సంఘాల్లో మీటింగ్స్ నిర్వహించారు. 29 సంఘాల్లో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు తీసుకున్న అభిప్రాయాల్లో 60 శాతం మంది 10ఎకరాల లోపు ఉన్నవారికే రైతుభరోసా ఇవ్వాలని చెబుతున్నారు. గుట్టలు, బీడు భూములకు ఇవ్వొదని కోరుతన్నారు.

Similar News

News February 8, 2025

నిజామాబాద్: రేటు రాక పసుపు రైతుల్లో ఆందోళన

image

నిజామాబాద్ మార్కెట్లో కొన్ని రోజులుగా పసుపు కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ధర మాత్రం గతేడాది కంటే తక్కువ ఉందని రైతులు చెబుతున్నారు. గత సీజన్లో మొదట 13 వేలకు క్వింటాలు ఉండగా ప్రస్తుత సీజన్లో అది 11 వేలకు పడిపోయింది. తెగుళ్లు సోకి పంట దిగుబడి తగ్గడం మరో వైపు ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News February 8, 2025

కామారెడ్డి: ఆ స్తంభానికి కరెంట్ కనెక్షన్ లేదు: డిపో మేనేజర్

image

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి బస్టాండ్‌లో శనివారం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు <<15397229>>విద్యుత్ స్తంభాన్ని<<>> ఢీకొట్టిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మాచారెడ్డి బస్టాండ్‌లో గతంలో విరిగి, ఎలాంటి కరెంట్ కనెక్షన్ లేని స్తంభాన్ని తాకిందని, ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారన్నారు.

News February 8, 2025

NZB: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.

error: Content is protected !!