News December 19, 2025
NZB: పల్లెల్లో మళ్లీ ఓట్ల పండుగ

పల్లెల్లో మళ్లీ ఓట్ల పండుగ రాబోతుంది. సర్పంచ్ ఎన్నికలు ముగియగానే ప్రభుత్వం డీసీసీబీ పీఏసీఎస్‌ల పాలకవర్గాలు రద్దు చేసింది. నెల రోజుల్లోగా సొసైటీల ఎన్నికలకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. గ్రామాల్లోని సొసైటీల డైరెక్టర్లను రైతులు ఓట్లు వేసి ఎన్నుకుంటారు. డైరెక్టర్లు చేతులెత్తి సొసైటీ ఛైర్మన్లను ఎంపిక చేస్తారు. ఛైర్మన్లు డీసీసీబీ డైరెక్టర్లను ఎంపిక చేయగా వారు జిల్లా ఛైర్మన్‌ను ఎంపిక చేస్తారు.
Similar News
News December 20, 2025
బాపట్ల జిల్లా పోలీసులకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అవార్డ్

జిల్లా పోలీసులకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. శుక్రవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఎస్పీ ఉమామహేశ్వర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అందుకున్నారు. కొందరు పర్యాటక శాఖకు చెందిన వెబ్ సైట్లను పోలిన నకిలీ సైట్లను సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ కేసులను సమర్థవంతంగా చేదించినందుకు డీజీపీ అవార్డును అందించినట్లు వివరించారు.
News December 20, 2025
నిర్మల్ జిల్లాలో రూ.14,67,700 సీజ్: ఎస్పీ

జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా సరిహద్దుల్లోని 12 చెక్‌పోస్టుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని రూ.14,67,700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నగదుతో పాటు రూ.7లక్షల విలువైన మద్యం పట్టుబడగా.. గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన 150 కేసుల్లో 201 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
News December 20, 2025
గుజరాత్‌లో SIR.. 73 లక్షల ఓట్లు తొలగింపు

గుజరాత్‌లో నిర్వహించిన SIRలో 73,73,327 ఓట్లను అధికారులు తొలగించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5.08 కోట్ల నుంచి 43.47 కోట్లకు తగ్గిందని డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ద్వారా తెలుస్తోంది. అభ్యంతరాలను జనవరి 18, 2026లోగా తెలియజేయాలి. వాటిని ఫిబ్రవరి 10లోగా అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. తొలగించిన ఓట్లలో 18 లక్షల మంది మరణించిన వారివి కాగా శాశ్వతంగా నివాసం మారిన ఓట్లు 40 లక్షలుగా గుర్తించారు.


