News April 8, 2025

NZB: పాప కనిపిస్తే సమాచారం ఇవ్వండి: SHO

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో తల్లి పక్కన నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారి రమ్య కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. సీసీ కెమెరాలో ఓ దుండగుడు చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందలతో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఆచూకీ తెలిస్తే 8712659837 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వన్ టౌన్ SHO రఘుపతి సూచించారు.

Similar News

News April 8, 2025

NZB: సర్టిఫికెట్ కోర్సు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాక్‌ శిక్షణ కేంద్రంలో ఎలక్ట్రికల్, సర్వేయర్, ప్లంబర్, మేస్త్రీ, పెయింటింగ్, టైలరింగ్ పెయిడ్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత వయస్సు 18 నుంచి45 సంవత్సరాలు అని సూచించారు. మరిన్ని వివరాలకు న్యాక్ కేంద్రాన్ని సందర్శించాలన్నారు.

News April 8, 2025

నిజామాబాద్: ఆకట్టుకున్న పారా గ్లైడింగ్ విన్యాసాలు

image

గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఆర్మీ అధికారుల నేతృత్వంలో పారా గ్లైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 250వ ఏఓసీ కార్ప్స్ డే సందర్భంగా సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో పారా మోటార్ ఎక్స్ పెడిషన్-2025 యాత్రను చేపట్టారు. ఢిల్లీ నుంచి ప్రారంభమైన యాత్ర ఆగ్రా, కాన్పూర్, ఝాన్సీ, సాగర్, జబల్పూర్, పుల్గాంల మీదుగా సాగుతూ నిజామాబాద్ నగరానికి చేరుకుంది.

News April 7, 2025

NZB: కలెక్టరేట్‌లో ఉచిత అంబలి

image

తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నెలకొల్పిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ప్రారంభించారు. చల్లని తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అన్నారు.

error: Content is protected !!