News June 25, 2024

NZB: పీజీ పరీక్షల రీవాల్యుయేషన్ షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం రీకౌంటింగ్ తేదీని ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు జులై 1 లోపు ఫీజు చెల్లించాలని సూచించింది. ఒక్కో పేపర్ రివాల్యుయేషన్‌కు రూ.500 చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ పేర్కొన్నారు.

Similar News

News June 29, 2024

NZB: పదవుల రేసులో ఆ ఇద్దరు నేతలు

image

ఢిల్లీలో కాంగ్రెస్ PCC అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు సాగుతోంది. జిల్లా నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. MLC మహేశ్‌కుమార్ గౌడ్, అధ్యక్షపీఠాన్ని ఆశిస్తున్నారు. NZBఎంపీగా 2సార్లు గెలిచిన మధుయాష్కీ కూడా ఈ పదవీ కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. కాగా జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News June 28, 2024

NZB: జీజీహెచ్‌లో బోధనా వైద్యుల నిరసన

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట శుక్రవారం బోధనా వైద్యులు ఆందోళన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోధనా వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్. కిరణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. నల్గొండలోని జనరల్ ఆస్పత్రిలో వైద్యుల హాజరును పర్యవేక్షించేందుకు రోజుకో ఆఫీసర్‌ను నియమిస్తూ అక్కడి కలెక్టర్ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

News June 28, 2024

నిజామాబాద్ : BRS నేతలతో సమావేశమైన కేసీఆర్

image

కామారెడ్డి జిల్లాలోని BRS మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, BRS అధినేత KCRను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ BRS జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు.