News February 26, 2025

NZB: పోలింగ్ సామాగ్రి పంపిణీ పరిశీలించిన కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. నిజామాబాద్ డివిజన్ కు సంబంధించి నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్  పరిశీలించారు.

Similar News

News February 26, 2025

పిట్లం: రాజీ కాలేదని కన్నతల్లిని కొట్టి చంపేశాడు..!

image

కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన పిట్లంలో మంగళవారం జరిగింది. SI రాజు వివరాలిలా.. సాబేర బేగం(60)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండో కొడుకైన శాదుల్ నాలుగేళ్ల క్రితం తన తమ్ముడైన ముజిబ్‌ను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాజీపడాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో రోకలి బండతో తలపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 26, 2025

నిజామాబాదు : రంజాన్ మాస సౌకర్యాల ఏర్పాటు:కలెక్టర్

image

రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. కలెక్టర్ తన ఛాంబర్‌లో మంగళవారం జిల్లా అధికారులతో సమావేశమై, రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.

News February 26, 2025

195 మంది పోస్టల్ బ్యాలెట్‌ వినియోగం

image

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ కోసం 255 మంది దరఖాస్తు చేసుకోగా 195 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టరేట్‌లో ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరిపామన్నారు.

error: Content is protected !!