News September 7, 2025

NZB: పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా బందోబస్తు పరిశీలన

image

నిజాముబాద్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన రథోత్సవ వేడుకలు కన్నుల పండువ కొనసాగింది. ఇందు కోసం ప్రత్యేక నిఘా వ్యవస్థను సీపీ సాయి చైతన్య ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడూ పరిస్థితిని పరిశీలించారు. ఈ మేరకు నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వినాయక రథోత్సవ వేడుకలను వీక్షించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టిగా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Similar News

News September 7, 2025

నిజామాబాద్: 13న జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ బాలుర జట్ల ఎంపికలు

image

జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న శనివారం ఉదయం10 గంటలకు నిజామాబాద్‌లోని క్రీడా మైదానంలో అండర్-16 బాలుర కబడ్డీ క్రీడా ఎంపికలు జరుగుతాయని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అంద్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని చెప్పారు.

News September 5, 2025

NZB: రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్

image

గ‌ణేశ్ నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ నేప‌థ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మ‌ద్యం దుకాణాలు మూసి వేయాల‌ని కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఉద‌యం 6 గంట‌ల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మించి మ‌ద్యం దుకాణాల‌ను తెరిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

News September 5, 2025

NZB: మార్కెట్ యార్డుకు నాలుగు రోజులు సెలవులు

image

నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌కు గురువారం నుంచి సోమవారం వరకు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ సెకండ్ గ్రేడ్ కార్యదర్శి తెలిపారు. శుక్రవారం మిలాద్-ఉన్-నబి, శనివారం వినాయక నిమజ్జనం, ఆదివారం సెలవు, సోమవారం గ్రహణం కారణంగా వ్యాపార లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి మంగళవారం నుంచి మార్కెట్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.