News February 4, 2025

NZB: ప్రజావాణికి 141 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్ అర్జీలు అందజేశారు.

Similar News

News February 4, 2025

 NZB: జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో 4 మెడల్స్

image

జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన దినేష్ వాగ్మారే 4 మెడల్స్ సాధించాడు. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో జరిగిన ఈ పోటీల్లో 35 ఏళ్ల కేటగిరిలో ప్రాతినిధ్యం వహించిన దినేష్ లాంగ్ జంప్ లో సిల్వర్, రిలే లో సిల్వర్ మెడల్, ట్రిపుల్ జంప్‌లో బ్రాంజ్ మెడల్, 100 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. దీంతో ఆయన వ్యక్తిగత ఖాతాలో మొత్తం నాలుగు మెడల్స్ నమోదు చేసుకున్నాడు.

News February 4, 2025

NZB: నగరంలో నేడు పవర్ కట్

image

నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్‌3 ADE వీరేశం తెలిపారు. వినాయక్ నగర్ సబ్స్టేషన్‌ పరిధిలో పలు మరమ్మతులు కారణంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. గాయత్రి నగర్, 1, 2, 3, 4, 5, ఆకుల పాపయ్య కాలనీ, చింత చెట్టు మైసమ్మ, కాశీనగర్, సిద్ధి వినాయక నగర్, కెనాల్ కట్ట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది.

News February 4, 2025

NZB: ఈ నెల 10 వరకు పరీక్ష ఫీజు గడువు

image

తెలంగాణలో ఏప్రిల్-మే నెలలో జరిగే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 10వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.