News December 26, 2025

NZB: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

image

నిజామాబాద్‌లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఓ కిలాడి లేడీ టోకరా వేసింది. ఏకంగా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, ఆర్‌అండ్‌బీ సీఈ సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు సృష్టించింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల నియామకం పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసింది. నియామక పత్రాలు నకిలీవని తేలడంతో బాధితులు మూడో టౌన్ పోలీసులను ఆశ్రయించారు.

Similar News

News December 26, 2025

భారత్ ఘన విజయం

image

శ్రీలంక ఉమెన్స్‌తో జరిగిన 3వ టీ20లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 113 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 42 బంతుల్లోనే 3 సిక్సర్లు, 11 ఫోర్లతో 79* రన్స్ చేశారు. హర్మన్ 21* పరుగులతో రాణించారు. ఈ విజయంతో మరో 2 మ్యాచులు ఉండగానే 5 టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.

News December 26, 2025

సూర్యాపేట: జీవో 252కు వ్యతిరేకంగా జర్నలిస్టుల గర్జన

image

జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా ఉన్న జీవో 252ను సవరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు TUWJ (H-143) ప్రకటించింది. అక్రిడేషన్లు కుదింపు, డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేసేలా ఉన్న నిబంధనలపై యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జీవోపై స్పష్టత లేక జర్నలిస్టులు అయోమయానికి గురవుతున్నారని మండిపడింది. ఈ నిరసనలో జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

News December 26, 2025

GWL: ఎస్పీని కలిసిన నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లు

image

గద్వాల జిల్లాను సందర్శించిన నలుగురు శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులు రాహుల్ కాంత్, మానిషా నెహ్రా, సోహం సునీల్, ఆయేషా ఫాతిమాలు శుక్రవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పోలీస్ యంత్రాంగం పనితీరు, చట్ట సంరక్షణ విధానాలపై ఎస్పీ వారితో చర్చించారు. నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రజా భద్రత కోసం అమలు చేస్తున్న ముందస్తు ప్రణాళికలను వారికి సవివరంగా వివరించారు.