News December 10, 2025
NZB: ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

నిజామాబాద్‌లో ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కొని వ్యక్తి మృతిచెందాడు. నిజామాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ 3పై రైలు ఎక్కే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. ప్లాట్‌ఫామ్, రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలై స్పాట్‌లోనే మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుందని, కుడిచేతి మధ్యవేలు లేదని గుర్తించారు. కేసు నమోదు చేశారు.
Similar News
News December 10, 2025
ADB: 938 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు

గ్రామపంచాయతీ ఎన్నికలకు జిల్లా పోలీసులతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మొదటి విడతలో భాగంగా 6 మండలాలలో ఎన్నికలు జరగనుండగా అందులో 39 క్లస్టర్లు, 34 రూట్‌లతో 166 గ్రామాలలో 225 పోలింగ్ లొకేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 938 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News December 10, 2025
తిరుపతిలో కొత్త దందా..!

తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఆటో డ్రైవర్లు కొత్త దందాకు తెరలేపారు. ‘టోకెన్లు త్వరగా అయిపోతాయి. మీరు(భక్తులు) లైన్‌లో నిల్చోకుండా మేమే తీసిస్తాం’ అంటూ ఫ్రీగా ఇచ్చే టోకెన్లకు రూ.500కుపైగా వసూలు చేస్తున్నారు. అక్కడి సిబ్బందితో కలిసి భక్తులకు టోకెన్లు తీసిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఈ దందా కొనసాగడం కొసమెరుపు. మిమ్మల్ని ఎవరైనా ఇలా డబ్బులు అడిగారా?
News December 10, 2025
ఈ నెల 12న ఆన్‌లైన్ జాబ్ మేళా

AP: పార్వతీపురం మన్యంలో ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 4 కంపెనీలు ఇంటర్వ్యూ ద్వారా 160 పోస్టులను భర్తీ చేయనున్నాయి. 18 ఏళ్లు నిండిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8


