News October 10, 2025

NZB: ఫిట్స్‌తో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

ఫిట్స్‌తో చికిత్స పొందుతూ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈనెల 3వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ వ్యక్తికి ఫిట్స్ రావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను గురువారం మృతి చెందాడు. మృతుడిని ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News October 10, 2025

NZB: ఈనెల 12 లోపు దరఖాస్తు చేసుకోవాలి

image

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర అధ్యక్ష పదవులను నియమించే ప్రక్రియ ప్రారంభించినట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఇందు కోసం AICC నుంచి జిల్లాకు అబ్జర్వర్‌గా నియమించిన కర్ణాటక MLA రిజ్వాన్ అర్షద్ జిల్లాకు రానున్నారన్నారు. ఆయన ఆధ్వర్యంలో జిల్లా, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆశావహులు ఈనెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 10, 2025

NZB: CM బందోబస్తుకు 600 మంది పోలీస్ సిబ్బంది: CP

image

నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో 600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం ఉదయం సిబ్బందితో విధుల నిర్వహణపై వివరించారు. ఏ విధంగా నిర్వహించాలి అనే అంశంపై బ్రీఫింగ్ ఇచ్చారు.

News October 10, 2025

NZB: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈనెల 1వ తేదీన గంజి ప్రాంతంలో ఓ వ్యక్తి అనారోగ్య సమస్యలతో పడిపోయి ఉండగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను గురువారం సాయంత్రం మృతి చెందినట్లు చెప్పారు. ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ సంప్రదించాలన్నారు.