News April 5, 2024
NZB: ఫోర్జరీ కేసులో ఉద్యోగి సస్పెండ్
సంతకం ఫోర్జరీ కేసులో గురువారం సదరు ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు. NZBలోని కిసాన్ సాగర్ PHCలో పనిచేస్తున్న జూ.అసిస్టెంట్ శ్రీనివాస్‌కు జక్రాన్‌పల్లి PHC ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఇద్దరు ఉద్యోగులకు GPF ఇప్పించే క్రమంలో పలు పత్రాలపై వైద్యాధికారి రవీందర్ సంతకం ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని ఆయన 20 రోజుల క్రితం జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు.
Similar News
News December 24, 2024
లింగంపేట: మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధించాలి: కలెక్టర్
మహిళలు ప్రభుత్వ సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం లింగంపేట్ మండలం బాచంపల్లి గ్రామంలో ఐకేపీ ఆర్థిక సహకారంతో చేపల పెంపకం, చేపల దాన తయారు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. చేపల పెంపకం దాన తయారు చేసేందుకు బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి ద్వారా కుంట యశోదకు రూ.3.50 లక్షల రుణం అందజేసినట్లు ఆయన తెలిపారు.
News December 24, 2024
అశోక్ నగర్‌లో గ్రూప్-2 అభ్యర్థి సురేఖ ఆత్మహత్య
HYD అశోక్ నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న గుగులోతు సురేఖ(22) ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువులు తెలిపిన వివరాలు.. కామారెడ్డి(D) గాంధారి(M) సోమారం తండాకు చెందిన సురేఖకు NZBకు చెందిన అబ్బాయితో గత నెలలో ఎంగేజ్మెంట్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న పెళ్లి కూడా నిశ్చయమైంది. కాగా కుటుంబ సమస్యలతో నిన్న సూసైడ్ చేసుకుంది.
News December 24, 2024
కామారెడ్డి: ఉద్యోగంలో చేరే లోపే విషాదం
HYD నానక్‌రాంగూడ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఐరేని <<14964716>>శివాని<<>>(21) మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం నిజాంసాగర్ నవోదయలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళానానికి హాజరయింది. అయితే ఆమె ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించారు. 4 నెలల్లో విధుల్లో చేరాల్సి ఉండగా ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. కుటుంబీకులు ఆమె నేత్రాన్ని LV ప్రసాద్ కంటి ఆసుపత్రికి డొనేట్ చేశారు.