News June 16, 2024
NZB: బక్రీద్ పండగ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1718541526674-normal-WIFI.webp)
బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని NZB సీపీ కల్మేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులాంగ్ ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రార్థన చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పై మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
Similar News
News February 9, 2025
నిజామాబాద్‌లో తగ్గిన చికెన్ అమ్మకాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739074800383_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లాలోని పలు కోళ్ల ఫారాలలో వింత వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లాలో చికెన్ అమ్మకాలు తగ్గాయి. నేడు మార్కెట్‌లో పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు స్కిన్‌తో రూ.160, స్కిన్ లెస్ రూ.220 వరకు ఉంది. వ్యాధి ప్రభావంతో ప్రజలు చికెన్ కొనేందుకు వెనుకంజ వేస్తున్నట్లు అమ్మకం దారులు తెలిపారు.
News February 9, 2025
NZB: ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి: MLC కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739034464880_1269-normal-WIFI.webp)
అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని MLC కవిత అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులతో BRS ఎమ్మెల్సీ కవిత జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ, విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు.
News February 9, 2025
UPDATE: రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయింది వీరే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739026449882_50486028-normal-WIFI.webp)
డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామ శివారులో శనివారం సాయంత్రం కారు చెట్టును ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిచ్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆర్యనగర్‌కు చెందిన గణేశ్, నరేశ్, రమేశ్, జగన్‌గా గుర్తించారు. కరీంనగర్ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ధర్మారంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. గాయాలైన యువకులు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు.