News January 13, 2025

NZB: బడా పహాడ్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

image

నిజామాబాద్ జిల్లాలోని బడా పహాడ్ దర్గాను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సాయంత్రం సందర్శించారు. దర్గాకు సందల్‌తో కూడిన చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆమెకు బడాపహాడ్ దర్గా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి దర్గా వద్ద ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు, సుమిత్రా ఆనంద్, అయేషా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 22, 2026

NZB: రెండు వారాల్లో 134 DD కేసులు :CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 134 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ 12.10 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

News February 22, 2026

NZB: NAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

NAC ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువత కోసం ల్యాండ్ సర్వేలో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని NZB అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణ ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18-35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, లేదా ITI సివిల్ చదివినవారు అర్హులన్నారు. వీరికి స్టేషనరీ, యూనిఫామ్ ఉచితం అని, గ్యారెంటీ ప్లేస్మెంట్ కల్పిస్తామన్నారు.