News July 9, 2024
NZB: బాయ్స్ హాస్టల్‌లో యువతి.. విద్యార్థి సస్పెండ్

బాయ్స్ హస్టల్‌లో యువతికి ఓ స్టూడెంట్ 15రోజుల క్రితం ఆశ్రయమిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్సిటీ అధికారుల వివరాలిలా.. టీయూలో విద్యార్థి పీజీ చదువుతూ యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్నాడు. అతను ఓ యువతికి ఆశ్రయమిచ్చిన విషయాన్ని తోటి విద్యార్థులు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఆ స్టూడెంట్‌ని సస్పెండ్ చేశారు.
Similar News
News January 27, 2026
నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి బదిలీ

నిజామాబాద్ నగర ఏసీపీ ఎల్. రాజా వెంకటరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సైబరాబాద్ ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న బి. ప్రకాష్‌ను నియమిస్తూ డీజీపీ శశిధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన రాజా వెంకటరెడ్డి బదిలీ కావడం నగరంలో చర్చనీయాంశమైంది. బదిలీ అయిన ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు.
News January 27, 2026
నిజామాబాద్: ఇందిరమ్మ ఇండ్లకు రూ.266.94 కోట్లు

నిజామాబాద్ జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 16,919 ఇండ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అందులో 12,850 మార్కింగ్ పూర్తి అయ్యాయని, 9,865 ఇండ్లు బేస్మెంట్ పూర్తి అయ్యాయన్నారు. రూఫ్ లెవెల్‌కు 6,651 ఇండ్లు, స్లాబ్ లెవెల్‌కు 4,981 ఇండ్లు, 216 ఇండ్లు పూర్తి అయ్యాయన్నారు. ఇందుకోసం రూ.266.94 కోట్లు ఖర్చు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News January 27, 2026
నిజామాబాద్ జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు

నిజామాబాద్ జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు రూ.368.45 కోట్ల పెట్టుబడితో స్థాపించబడ్డాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడిందన్నారు. అలాగే జిల్లాలో 900 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను రూ.516.60 కోట్ల పెట్టుబడితో స్థాపించి 6,983 మందికి ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు.


