News October 29, 2025

NZB: బాలికపై అఘాయిత్యం.. కోర్టు సంచలన తీర్పు

image

మైనర్ బాలికపై అత్యాచార కేసులో కామారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాచారెడ్డి పీఎస్ పరిధిలో దాడికి పాల్పడిన నిందితుడు భూక్యా గణేశ్‌కు జిల్లా జడ్జి CH VRR వర ప్రసాద్ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. విదేశాలకు పారిపోయినా నిందితుడు చట్టం నుంచి తప్పించుకోలేడని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. పోలీసు అధికారులు, దర్యాప్తు బృందాన్ని ఎస్పీ అభినందించారు.

Similar News

News October 29, 2025

రేపటి నుంచి జిల్లాలో స్కూల్స్ యథాతధం: డీఈవో

image

మొంథా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో రేపటి నుంచి స్కూల్స్ యథాతధంగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం వాతావరణం నెమ్మదించడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి యథాతధంగా పనిచేస్తాయని చెప్పారు.

News October 29, 2025

సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ₹10 కోట్లు

image

AP: సత్యసాయి శతజయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇతర ఏర్పాట్లకోసం ₹10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. NOV 23న పుట్టపర్తిలో దీన్ని నిర్వహిస్తారు. కాగా దీనిపై దాఖలైన PILను హైకోర్టు విచారించింది. పలు సేవలందించిన వారిని స్మరించుకోవడంలో తప్పులేదంది. పిల్‌ను వెనక్కు తీసుకోవాలని సూచించడంతో పిటిషనర్ ఉపసంహరించుకున్నారు.

News October 29, 2025

పల్నాడులో రేపటి నుంచి స్కూల్స్ రీ ఓపెన్: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30న పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో నిర్మాణ నష్టం, నీరు నిలిచిపోవడం వంటి భద్రతా సమస్యలు తలెత్తితే, విద్యార్థులను వెంటనే సురక్షిత గదులకు తరలించాలని హెచ్‌ఎంలను, ప్రిన్సిపాళ్లను ఆమె ఆదేశించారు.