News April 1, 2025
NZB: బిక్షాటన డబ్బులు ఎక్కువ వస్తున్నాయని బాలుడి హత్య

NZBలో 14 నెలల బాలుడు కైలాస్ హత్య కేసును వన్‌టౌన్ పోలీసులు చేధించారు. మహారాష్ట్రకు చెందిన బోస్లే మాలాబాయి, ఆమె కొడుకు గోపాల్ హత్య చేసినట్లు వన్‌టౌన్ SHO రఘుపతి తెలిపారు. పోలీసుల వివరాలు.. కమలాబాయి అనే మహిళకు బిక్షాటన చేసే సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని.. అదే సమయంలో వీరికి తక్కువ డబ్బులు రావడంతో కక్షతో ఈ నెల 27న రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న బాలుడిని తీసుకెళ్లి బండి రాయితో కొట్టి హత్య చేశారు.
Similar News
News April 2, 2025
NZB: రేషన్ షాపులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో పలు రేషన్ దుకాణాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో లబ్ధిదారులకు సజావుగా బియ్యం పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో బియ్యం పంపిణీ జరిగింది, ఇంకా ఎంత మందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News April 2, 2025
రుద్రూర్: యువకుడి అదృశ్యం

రుద్రూర్‌కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైనట్టు ఎస్ఐ సాయన్న తెలిపారు. గత ఏడాది ఇల్లు కట్టడానికి అప్పులు కావడం వల్ల విజయ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గత నెల 11న ఇంట్లో నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. పలు చోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో అతని భార్య మంగళవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
News April 2, 2025
NZB: ఆత్మహత్య.. చికిత్స పొందుతూ మృతి

నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరులో ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్‌లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడాడు. అందులో దాదాపుగా రూ.5లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇంట్లో వారికి తెలిస్తే కోప్పడతారని గడ్డి మందు తాగాడు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.