News October 13, 2025

NZB: బీజేపీ పోరాట ఫలితంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు: దినేష్ కులాచారి

image

బీజేపీ పోరాట ఫలితంగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News October 14, 2025

నిజామాబాద్: బాలికలను ఆటపట్టించిన ఇద్దరి అరెస్టు

image

నిజామాబాద్‌లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోటగల్లి వద్ద సోమవారం బాలికలను ఫాలో చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఆకతాయిలను షీ టీం పట్టుకొని తదుపరి చర్యలకు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. బాలికలను, మహిళలను ఎవరైనా వేధిస్తే షీ టీంకు తెలపాలన్నారు.

News October 13, 2025

నిజామాబాద్‌లో సంఘటన్, సృజన్ అభియాన్

image

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మనలా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సంఘటన్, సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా నాయకత్వం ఎంపిక ప్రక్రియ కోసం కాంగ్రెస్ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

News October 13, 2025

నిజామాబాద్: ‘ఈ నెల 18న బంద్‌కు సహకరించాలి’

image

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఈ నెల 18న నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌కు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ కోరారు. సోమవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌కు సోమవారం సాయంత్రం వినతిపత్రం అందించారు. రిజర్వేషన్లకు వివిధ రాజకీయ పార్టీల తీరుకు నిరసనగా బంద్ చేపడుతున్నట్లు చెప్పారు. అగ్రవర్ణాల వారు బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకుంటున్నారన్నారు.