News February 18, 2026
NZB: ‘భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలి’

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు చేయాలని, ప్రభుత్వాలు కార్పొరేట్ యాజమాన్యానికి వత్తాసు పలుకకుండా, అందరికీ ఒకే ఉచిత విద్యా విధానాన్ని రూపొందించాలని కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. NZBలో బుధవారం ప్రారంభమైన AISF రాష్ట్ర 4 మహాసభల్లో ఆయన మాట్లాడారు. భగత్ సింగ్, చేగువేరా స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలన్నారు.
Similar News
News February 20, 2026
యాక్సెంచర్ కొత్త రూల్: AI వాడితేనే ప్రమోషన్.. లేదంటే నో ఛాన్స్!

ప్రమోషన్ కావాలంటే కంపెనీకి చెందిన AI టూల్స్ వాడటం తప్పనిసరని యాక్సెంచర్ తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్లు తమ రోజువారీ పనిలో AI టూల్స్ వాడుతున్నారో లేదో HR విభాగం ఇకపై నిశితంగా గమనించనుంది. ఇందుకోసం వారు వారానికి ఎన్నిసార్లు లాగిన్ అయ్యారో ట్రాక్ చేస్తోంది. AIకి అలవాటు పడని వారు కంపెనీ నుంచి బయటకు వెళ్లాల్సిందేనని గతంలోనే CEO జూలీ స్వీట్ హెచ్చరించారు.
News February 20, 2026
PDPL: SMలో పోస్టులు పెట్టకపోతే బతికేదేమో..!

HYD వనస్థలిపురంలో గర్భిణిని మాజీ భర్త చంపడానికి ప్రధాన కారణం SMలో పెట్టిన పోస్టులేనని తెలిసింది. మహారాష్ట్రవాసి సునీత, PDPL మంథనివాసి మహేశ్ 2022లో పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలతో 2024లో లీగల్‌గా విడిపోయారు. ఆపై HYDలో పరిచయమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనాథ్‌ను సునీత రెండోవివాహం చేసుకుని తానిప్పుడు హ్యాపీగా ఉన్నట్లు SMలో పోస్టులు పెట్టింది. ఇవిచూసి రగిలిపోయిన మహేశ్ మాజీ భార్యను <<19175516>>బుధవారం హత్య<<>> చేశాడు.
News February 20, 2026
ముడతలను ఇలా తగ్గించుకోండి

వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి ముడతలు వస్తుంటాయి. కానీ ప్రస్తుతం చిన్నవయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. వీటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్ర్కీన్ లోషన్ రాసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, విటమిన్C, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఫేషియల్ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించొచ్చని చెబుతున్నారు.


