News August 31, 2024

NZB: భారీ వర్షం.. రోడ్డుపై విరిగి పడిన చెట్టు..

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా అంతటా తడిసి ముద్దైంది. వర్షం ధాటికి కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మద్దేల్‌చెరువు- బాన్సువాడ ప్రధాన రహదారిపై ఓ భారీ వృక్షం విరిగి నేలకొరిగింది. బాన్సువాడ నుంచి పిట్లం, బిచ్కుంద మండలాలకు రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News September 16, 2025

టీయూ ఎం.ఎడ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్/అక్టోబర్‌-2025లో నిర్వహించనున్న ఎం.ఎడ్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు సెప్టెంబర్ 20లోపు ఫీజులు చెల్లించవచ్చని, రూ.100 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 22 వరకు గడువు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు www.telanganauniversity.ac.inను సందర్శించాలని సూచించారు.

News September 16, 2025

నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

image

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

News September 16, 2025

నిజామాబాద్: విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఇంజినీర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటితరం ఇంజినీర్లు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.