News August 28, 2025

NZB: భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థల బంద్

image

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు విధిగా సెలవు పాటించాలని సూచించారు. వర్షాల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టమన్నారు.

Similar News

News August 28, 2025

అనవసరంగా ఎవరూ బయటకు రాకూడదు: CP

image

రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను, అనవసరంగా ఎవరు బయటకు రాకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం హెచ్చరించారు. విద్యుత్ తీగల వద్దకు ఎవరు వెళ్ళకూడదని, ఎలాంటి అపోహలను నమ్మవద్దని ఆయన సూచించారు. ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News August 28, 2025

SRSP UPDATE: 2లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 2.76C/s ఔట్ ఫ్లో

image

కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి గురువారం ఉదయం 11 గంటలకు ఎగువ నుండి ఇన్ ఫ్లోగా 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 2,76,567 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఇందులో 39 గేట్ల ద్వారా 2.50 లక్షల క్యూసెక్కులు,
ఇందిరమ్మ కాల్వకు 17300, మిషన్ భగీరథకు 231, సరస్వతీ కెనాల్ కు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

News August 27, 2025

SRSP UPDATE: 39 గేట్లు ఓపెన్

image

కురుస్తున్న వర్షాలతో SRSPకి వరద నీరు పోటెత్తడంతో బుధవారం రాత్రి 8 గంటలకు మొత్తం 39 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. ఉదయం 10 గంటలకు 8 గేట్లు, మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 39 గేట్లు, ఇతర కాలువల ద్వారా మొత్తం 1,71,048 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.