News September 22, 2025
NZB: ‘భూసేకరణ ప్రక్రియను నెలాఖరు లోపు పూర్తి చేయాలి’

జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణపై రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సూచనలు జారీ చేశారు.
Similar News
News September 22, 2025
NZB: ఇందిరమ్మ చీర అని పెడితే ఊరుకోం: కవిత

మహిళలకు ఇచ్చే చీరలకు బతుకమ్మ చీరలు లేదంటే తెలంగాణ ఆడబిడ్డల చీర అని పేరు పెట్టాలని, ఇందిరమ్మ చీర అని పేరు పెడితే మాత్రం ఊరుకునేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆమె మాట్లాడారు. ఆడబిడ్డలకు ఒకటి కాదు, రెండు చీరలిస్తామని గతంలో హామీ ఇచ్చారన్నారు.
News September 22, 2025
NZB: కలెక్టరేట్ ప్రజావాణికి 89 ఫిర్యాదులు

నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 89 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్‌తో పాటు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
News September 22, 2025
SRSP అప్డేట్.. 40గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 2,16, 455 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు 40 గేట్ల ద్వారా అధికారులు 2,00,000 క్యూసెక్కుల వరదను గోదావరి నదిలోకి వదులుతున్నారు. IFFC 6735, కాకతీయ 5500, ఎస్కేప్ 2500, సరస్వతి 400, లక్ష్మీ 200, అలీ సాగర్ 180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 1091 అడుగులకు చేరుకోగా 80.501TMC నీరు నిల్వ ఉంది.