News January 26, 2025
NZB: మంద కృష్ణకు శుభాకాంక్షలు: కవిత

పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన మంద కృష్ణ మాదిగకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తి మంద కృష్ణ అని కొనియాడారు. ఆయనకు పద్మ శ్రీ అవార్డు రావడం సంతోషకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మందకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News September 16, 2025
ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి

తెలంగాణలో నలుగురు IAS అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. NVS రెడ్డిని HMRL ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆయనను ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుడిగా నియమించింది. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. HMDA సెక్రటరీగా శ్రీవాత్సవ, SC గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యలకు అదనపు బాధ్యతలిస్తూ నిర్ణయించింది. పూర్తి వివరాలకు <
News September 16, 2025
వనపర్తి: పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

ఉపాధ్యాయులు విద్యార్థులకు పోక్సో చట్టంపై నిరంతరం అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎస్పీ గిరిధర్‌తో కలిసి ఉపాధ్యాయులకు ఈ చట్టంపై అవగాహన కల్పించారు. సమాజంలో చిన్నారులపై నేరాలను అరికట్టడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని కలెక్టర్, ఎస్పీలు తెలిపారు. విద్యార్థులకు ఈ చట్టం గురించి బోధించాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News September 16, 2025
అమరావతిలో ఆధునిక మురుగునీటి వ్యవస్థ

అమరావతిలో 934 కి.మీ పైపుల ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మిస్తోంది. 13 STPలు రోజుకు మొత్తం 330.57 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయని CRDA పేర్కొంది. ఇవి ఫ్లషింగ్, శీతలీకరణ & నీటిపారుదల కోసం నీటిని తిరిగి ఉపయోగించుకునేలా చేస్తాయి! నగరాన్ని పచ్చగా, స్థిరంగా మార్చడానికి ఒక సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను కూడా ప్లాన్ చేస్తున్నారు.