News October 19, 2025
NZB: మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ

NZB, KMR జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం నుంచే అభ్యర్థులతో ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. శనివారం నాటికి నిజామాబాద్ జిల్లా(102)లో 2,568, కామారెడ్డి జిల్లా(49)లో 1,400పైగా దరఖాస్తులు వచ్చాయి. కాగా షాపులకు దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్యం ఇంకా పెరగనున్నాయి.
Similar News
News October 19, 2025
‘కాంతార’లో మెప్పించిన SRపురం వాసి

పాన్ ఇండియా మూవీ ‘కాంతార’లో SRపురం(M) పొదలపల్లికి చెందిన ఏకాంబరం నటించారు. ఇందులో భాగంగా తన నటనకు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి మొచ్చకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన్ను స్వగ్రామం గంగాధర నెల్లూరులో వైసీపీ నేత కృపాలక్ష్మి అభినందించారు. సినిమా రంగంలో మరింత ప్రతిభ చూపి గుర్తించ దగ్గ పాత్రలు పోషించాలని ఆమె ఆకాంక్షించారు.
News October 19, 2025
GNT: అత్యాచారం చేసి.. భయం లేకుండా బిర్యానీ తిన్నాడు.!

సత్రాంగచ్చి-చర్లపల్లి రైలులో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడు రాజారావును మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగుచూశాయి. బాధితురాలి నుంచి లాక్కున్న ఫోన్ విక్రయించి బిర్యానీ తిన్నానని, గతంలో కేరళ మహిళపై కూడా ఇలానే అత్యాచారం చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. బాధితురాలి సిమ్‌ను తన ఫోన్‌లో వేయడంతో సిగ్నల్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు.
News October 19, 2025
DRDOలో 50 పోస్టులు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

DRDO ఆధ్వర్యంలోని ప్రూప్& ఎక్స్‌పెరిమెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో 50 అప్రెంటిస్‌లకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BE/బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.isro.gov.in/