News January 29, 2025
NZB: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురికి జైలు శిక్ష: ACP

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురికి జైలు శిక్ష పడినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 22 మంది పట్టుబడ్డారన్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో హాజరు పర్చగా అందులో ఆరుగురికి స్పెషల్ జ్యుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహన్ బేగం 1 రోజు నుంచి 3 రోజుల వరకు జైలు శిక్ష విధించారు.
Similar News
News March 13, 2025
NZB: 651 మంది విద్యార్థుల గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-1 పరీక్షకు మొత్తం 651 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 18,197 మంది విద్యార్థులకు 17,546 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని రవి కుమార్ వివరించారు.
News March 13, 2025
NZB: వైన్స్ దుకాణాలు బంద్

హోలీ పండుగ నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి మద్యం షాపులు మూతపడనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటలు వరకు మూసి ఉంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ షాపులు మూతపడనుండడంతో మద్యం ప్రియులు వైన్ షాప్స్ వద్దకు పరుగులు పెడుతున్నారు.
News March 13, 2025
భీంగల్: గ్రూప్-1 ,గ్రూప్- 2లో సత్తా చాటిన ఎక్సైజ్ SI

నిజామాబాద్ జిల్లా భీంగల్ లో ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కార్గాం గోవర్ధన్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 , గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. గ్రూప్-2లో 394.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు, బాసర జోన్‌లో 7వ ర్యాంకు సాధించాడు. ఈయన స్వగ్రామం నిర్మల్ జిల్లా కుంటాల మండలం. గ్రూప్-1 లో 421 మార్కులు సాధించి జిల్లా స్థాయి అధికారి పోస్ట్ కొరకు వేచి చూస్తుండటం విశేషం.