News December 24, 2025
NZB: మరో మూడు రోజులే గడువు

TU పరిధిలోని B.Ed, B.P.Ed మొదటి, మూడవ రెగ్యులర్ సెమిస్టర్ల పరీక్షల ఫీజు చెల్లింపుకు ఈ నెల 27 ఆఖరు తేదీ అని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ విద్యార్థులకు సూచించారు. జనవరిలో నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించి సంబంధిత కళాశాలల్లో ఫీజులు చెల్లించాలన్నారు. అపరాధ రుసుము రూ.100తో ఈ నెల 29 లోపు కూడా చెల్లించవచ్చన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.
Similar News
News December 31, 2025
గద్వాల: వేడుకల వేళ అప్రమత్తం.. 108 సిబ్బందికి ఆదేశాలు

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో 108 అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కోఆర్డినేటర్ రత్నమయ్య ఆదేశించారు. డిసెంబర్ 31 రాత్రి యువత ఉత్సాహంతో వాహనాలను వేగంగా నడిపే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. యువత మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా, ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు.
News December 31, 2025
నిర్మల్: 568 యాక్సిడెంట్లు.. 154 మంది మృతి

నిర్మల్ జిల్లాలో 2025 ఏడాదిలో మొత్తం 568 యాక్సిడెంట్లు జరిగినట్లు పోలీసు శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రమాదాల్లో 154 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా నిర్మల్-భైంసా మార్గంలోనే యాక్సిడెంట్లు జరిగినట్లు తెలిసింది. ఎక్కువ మంది మద్యం తాగి వాహనాలు నడపడంతోనే మృతి చెందడం, గాయాలపాలైన వారు చాలా ఉన్నారు. అటు డ్రంక్ & డ్రైవ్ కేసులు 7908 నమోదయ్యాయి.
News December 31, 2025
నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్

నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది సెప్టెంబరు 6న అక్కడ బాధ్యతలు చేపట్టిన ఆయన, ఉద్యోగోన్నతిపై నారాయణపేటకు రానున్నారు. ఉమాశంకర్ ప్రసాద్ బుధవారం ఇక్కడ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.


