News March 22, 2024
NZB: మహిళ హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష

మహిళను కిరాతకంగా హత్య చేసిన కేసులో నలుగురు నిందితులకు 14 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతా కుంచాల శుక్రవారం తీర్పు చెప్పారు. ఆర్మూర్ శివారులోని మామిడిపల్లిలో ఒంటరిగా నివాసం ఉండే బొణికే భారతి (55)ను 2018లో తోకల చిత్ర, బట్టు వెంకటేష్, పందిర్ల రాజేందర్ గౌడ్, బట్టు రంజిత్ గొంతు కోసి హత్య చేసిన అభియోగాలు నిర్దారణ కావడంతో జిల్లా జడ్జిపై మేరకు తీర్పు చెప్పారు.
Similar News
News October 23, 2025
NZB: వైన్స్ దరఖాస్తులకు నేడే లాస్ట్

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియనుందని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా 102 మద్యం షాపులకు 2,658 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. కాగా ఈ నెల 27న భారతి గార్డెన్లో మద్యం దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
News October 23, 2025
నిజామాబాద్లో ధాన్యం సేకరణ ఏర్పాట్లు భేష్: ఎండీ లక్ష్మి

ఖరీఫ్ వరి ధాన్యం సేకరణ కోసం నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లు అభినందనీయమని స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ (MD) లక్ష్మి (ఐఏఎస్) అన్నారు. బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆమె ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ, సొసైటీ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారుల ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లను ఆమె ప్రశంసించారు.
News October 22, 2025
NZB: ఈవీఎం గోడౌన్ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్ వినాయకనగర్లోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి ఉన్నారు.