News January 27, 2025

NZB: మాణిక్‌భండార్‌లో శునకాలకు బారసాల

image

నిజామాబాద్ నగర శివారు మాణిక్‌భండార్‌లో ఓ కుటుంబం ఆదివారం శునకాలకు బారసాల చేశారు. మాణిక్ బండారుకు చెందిన నర్సాగౌడ్ మంజుల దంపతులు ఓ శునకాన్ని తెచ్చుకుని దానికి లూసీ అని పేరు పెట్టారు. లూసీ ఇటీవల ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. వీటికి ఆదివారం ఆ దంపతులు ఘనంగా బారసాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేశారు.

Similar News

News February 18, 2026

NZB: వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 18, 2026

NZB: అభివృద్ధి తమ లక్ష్యమంటున్న ప్రథమ పౌరులు..!

image

NZB మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ పురపాలక సంఘాల్లో ప్రథమ పౌరులుగా మహిళలే ఎన్నికవ్వడం విశేషం. NZB మేయర్‌గా కూరగాయల ఉమారాణి, బోధన్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా తూము పద్మ, ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్‌గా లహరి, భీంగల్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా బొదిరే నాగమణి ఎంపికైన సంగతి తెలిసిందే. వీరందరూ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని అంటున్నారు.

News February 18, 2026

నిజామాబాద్‌లో టమాటా ధర ఎంతంటే?

image

నిజామాబాద్‌లో టమాటా ధర బాగా తగ్గింది. హోల్‌సేల్‌లో కిలో రూ.4-5 ఉండగా రిటైల్ మార్కెట్‌లో రూ.10 కిలోగా ఉంది. ఇక బెండకాయ, బీరకాయ రూ.80 కిలో, పచ్చి మిర్చి రూ.70, ఆలుగడ్డలు రూ.20, చిక్కుడుకాయ రూ.40, క్యాప్సికం రూ.60, క్యారెట్ రూ.50, బీట్ రూట్ రూ.50, వంకాయ రూ.40, చామ గడ్డ రూ.50, బిన్నీస్ రూ.80 కిలో, సొరకాయ ఒకటి 10 నుంచి 20 రూపాయలుగా ఉంది. కొత్తిమీర కట్ట రూ.10 నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.