News September 5, 2025

NZB: మార్కెట్ యార్డుకు నాలుగు రోజులు సెలవులు

image

నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌కు గురువారం నుంచి సోమవారం వరకు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ సెకండ్ గ్రేడ్ కార్యదర్శి తెలిపారు. శుక్రవారం మిలాద్-ఉన్-నబి, శనివారం వినాయక నిమజ్జనం, ఆదివారం సెలవు, సోమవారం గ్రహణం కారణంగా వ్యాపార లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి మంగళవారం నుంచి మార్కెట్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Similar News

News September 4, 2025

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: NZB కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన ఆర్డీఓలు, తహశీల్దార్లతో వీసీ ద్వారా భూభారతిపై సమీక్ష జరిపి మాట్లాడారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.

News September 4, 2025

NZB: 200 సీసీ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ శోభయాత్ర కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు CP సాయిచైతన్య తెలిపారు. శోభయాత్ర దారి పొడవునా గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. 200 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. 1,300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామని CP వివరించారు.

News September 4, 2025

NZB: డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ మోసం.. కేసు నమోదు

image

సైబర్ నేరగాళ్లు NZBకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ. 10 లక్షలు కాజేసినట్లు NZB సైబర్ క్రైమ్ DSP వెంకటేశ్వరరావు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు బాధితుడికి వీడియో కాల్ చేసి ‘మనీలాండరింగ్ కేసుతో మీ బ్యాంకు ఖాతాకు సంబంధం ఉంది’ అని భయపెట్టి డిజిటల్ అరెస్ట్ చేసినట్లు’ చెప్పి అతడి కుటుంబాన్ని ఇంట్లో నిర్బంధించి రూ.30 లక్షల బదిలీ చేయించుకున్నారు. బాధితుడు 1930ను సంప్రదించగా రూ. 20 లక్షలు స్తంభింపజేశారు.